దునియా Express

Saturday, January 5, 2008




ఓ విశాల భారతమా........ఆ కన్నీరు ఎందుకమ్మా




భారత్ వందకోట్ల ప్రభం'జనం'.ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాసామ్యం.Science, Tecnology, Entertainment, Software, Stock Market ఇలా రంగంతో సంభందం లేకుండా ప్రపంచ దేశాల అందరి దృష్ఠి ఇక్కడే.ప్రపంచ ధనవంతులు లెక్క పెట్టవలసి వస్తే మొదలు పెట్టవలసింది ఇక్కడే.మరి అలాంటి భారతమ్మకి కన్నీల్లా! నూరు సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో భందీగావున్నా రాని కన్నీరు ఇప్పుడేంటి.అప్పుడంటే ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా తన కోసం ఏమైనా చేసే తన కన్నబిడ్డలు.ప్రాణం పోతున్నా చివరి నిముషంలో కూడా 'జై భారత మాతా' 'వందేమాతరం' అని నినాదాలు చేసిన పోరాటయోధులు.త్యాగమూర్తులు.భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మంగల్ పాండె, రాజగురు, అల్లూరి సీతరామరాజు, ఝాన్సీ లక్ష్మీభాయ్ ఇలా ఎందరో పోరాటయోధులు అందుకు నిదర్శనం.మరి ఇప్పుడు తన కన్న బిడ్డలు వికృత చేష్టలు.కన్న తల్లులను, ఆడ బడచులను అమ్ముకుంటున్న కషాయితత్వం.పసి పిల్లలను భానిసలుగా చేస్తున్న రాక్షసతత్వం.రాజకీయ నాయకులు, పోలీసులు, డాక్టర్లు, ఇంజినేరులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాన మంత్రి నుంచి సామాన్య పౌరుడు వరుకూ అందరూ తమ కర్తవ్యాన్ని మరచి వ్యభిచారాని కంటా అతి హీనమైన లంచానికి అలవాటుపడ్డ మూర్ఖత్వం భారతమ్మ కన్నీరుకు కారణమైయాయి.

వందకోట్ల మంది భారతీయులు.కాని అంతా కలసి ఒకే సారి 'జై భారతమాత ' 'వందేమాతరం' అనలేని ఐక్యమత్యం.మతం, కులం, ప్రాంతీయం ఇవి మూడే ఐక్యమత్యానికి మనం చూపే అడ్డంకులు.భారతీయత కంటా విలువ తెచ్చే కులం వుందా?భారతీయతను మించిన మతం వుందా?'నాది భారత దేశం'.దీనికంటా గొప్ప వాక్యం నీ ప్రాంతీయతతో నువ్వు సమికూర్చగలవా?'లేదూ అనే సమాధనం మీ మనస్సులో వున్న, కుల మత ప్రాంతీయ పిచ్చితో అది భయటకు రాలేకపోతుంది.ఈ పిచ్చి దేశ అభివృద్దికే కాదు మనిషిగా మనం ఎదగడానికి కూడా అడ్డుగోడ.ఈ పిచ్చి నుంచి ఒక్కసారి భయటకు వచ్చి అలోచిద్దాం 'మనం భరతీయులం.మాది భారతదేశం.మా కులం,మతం భారతీయం' అని గట్టిగా అరచి భారతమ్మ కన్నీరు తుడవడానికి సహకరిద్దాం.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాసామ్యం.ఈ మాట వింటే కొంత మంది న్వ్వుతారు.కొంత మంది హేలన చేస్తారు.అసలు భారతదేశంలో ప్రజాసామ్యం ఎక్కడ వుందని వారి వాదన.ఇది నిజమే.'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాసామ్యం' ఈ వాక్యంలో 'ప్రజాసామ్యం' అనే పదానికి అర్దం మార్చేసామే తప్ప ఆ వాక్యం అక్షరాల సత్యం.'పజల వలన,ప్రజల చేత,ప్రజల కోసం అయిన పరిపాలనను డబ్బు వలన, డబ్బు చేత, డబ్బు కోసం మార్చేసాము.దీనికి కారణం ఎవరు, భాద్యులు ఎవరు? అందుకు కారణం మనం, భాద్యులుమూ మనమే.సార పేకెట్ కి, వంద నోటికి ఓటును అమ్మేసుకొంటున్న నీచమైన జనం, ఓటు వేస్తే మనకేమి వస్తాది అని ఆలోచించే నీచాతి నీచమైన జనం ప్రజాసామ్యాన్ని పజల నుండి దూరం చేసి డబ్బుకి దగ్గర చేసారు, భారతమ్మ కన్నీరుకు కారణం అయ్యారు. ప్రజాసామ్యంలో ఓటుకి చాలా శక్తి వుంది దాన్ని సారా పేకెట్ కి, వంద నోటికి అమ్మేసి దేశ అభివృద్దికి అడ్డుకాకండి.ఓటు హక్కును సక్రంగా ఉపయోగించి నవ స్వాతంత్రానికి నాంది పలకండి.భారతమ్మ రుణం తీర్చుకోండి.'జై భారతమాతా'.

అగ్రరాజ్యాల వెన్నులో సైతం చలి పుట్టించే సత్తా.కాని మనం మన కళ్ళెదురు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించలేని ధైర్యవంతులం.'ధైర్యే సాహాసే విజయం'.ఆ ధైర్యంతోనే స్వతంత్రాన్ని సాధించాం.తుపాకి గుళ్ళకే గుండెను చూపించిన ధైర్యం మనది, ఉరి తాడుకే భయం పుట్టించిన ధైర్యం మనది, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నే వణికించిన ధైర్యం మనది.మరి అలాంటి ధైర్యం ఇప్పుడు ఏమైంది!ఏమి కాలేదు మన రక్తంలో ఇంకా అలాగే వుంది, కాని మనలో స్వార్ధం పెరిగిపోయింది.ఎంత ఎలా పెరిగిపోయిందంటే మనలోని ధైర్యాన్ని మనకే తెలియకుండా చేసింది.ఎవరికైనా ఏమైన జరుగుతే మనకి ఎందుకులే మనం బాగానే వున్నాం అని చెప్పే స్వార్ధం.అదే సంఘటన మనకి ఎదురైతే ఏమి చెయ్యాలో చెప్పదు.స్వార్ధం మనిషిని ఒక్కడిగా చేస్తుంది, మనకి కష్టాలు వచ్చినప్పుడు ఒంటరని చేస్తుంది, మనలో ధైర్యాన్ని చంపేసి పిరికి వాడిని చేస్తుంది.వద్దూ......వద్దూ అలాంటి స్వార్ధం మనకి వద్దు.మనలో స్వార్ధాన్ని తరిమేసి, ధైర్యాన్ని తిరిగి తెచ్చుకొని భారత మాత వీరబిడ్డలగా గర్విద్దాం.'జై భారత మాత '.

లంచం భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూవున్న దేశంగానే వుండటానికి కారణం, స్వతంత్రం 60 వసంతాలు పూర్తిచేసుకొన్న పేదవాడి ఆకలి ఆకలిగానే వుండటానికి కారణం, నిరుద్యోగులు నిరుద్యోగులగానే వుండటానికి కారణం, పసి పిల్లలు ప్రాధమిక విద్య అందక ఇంకా బానిసలుగా వుండటానికి కారణం ఇవే కాదు ప్రతీది......... భారతదేశ అభివృద్ధికి అడ్డంకులుగా చెప్పుకొనే ప్రతీ విషయంలోని దాని హస్తం వుంది.అయినా మన రాజకీయనాయుకులకు, డక్టరులకు, ఇంజినీరలకు, ఉద్యోగులకు ఇలా ప్రధానమంత్రి నుంచి క్రింద స్థాయి ఉద్యోగి వరకు ఇదంటే చాలా ఇష్టం.వాళ్ళందరి ఇష్టంతో ఎంతగా పెరిగి పోయిదంటే దీన్ని అరికట్టడానికి ఏకంగా మనం Anti Corruption Beareu అనే సంస్థనే స్థపించాం ఎవరకు తెలుసు వీళ్ళు కూడా లంచానికి మినహాయిపు కాదని.లంచం అది వ్యభిచారాని కంటే అతి హీణమైనది.లంచాని అరికడదాం భారతదేశ అభివృద్ధిలో భాగసామ్యలు అవుదాం.'జై భారతమాత '.

ఎన్ని దారుణాలు! ఈ దారుణాలు అన్ని చూస్తూ వీటి అన్నింటికి కారణం తన కన్న బిడ్డలే అని తెలుసుకొన్న ఏ తల్లి మాత్రం కన్నీరు పెట్టుకోదు.ఎవరు ఎన్ని దారుణాలు చేసిన, అరాచకాలు సృష్టించిన ఇంకా కొన్ని వేల మంది నీ కన్నీరు తుడవడానికి ముందుకు వస్తున్నారు.ప్రాణాలు సైతం లెక్కచెయ్యకుండా నీ కోసం ఏమైన చెయ్యడానికి సిద్ధంగా వున్నారు అమ్మా.ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం పై చేసిన యుద్ధం స్వాతంత్రం కోసం అయితే,ఈ రోజు మనలో వున్న దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అవినీతిపరులు పై చేస్తున్న యుద్ధం ఓ నవ స్వాతంత్రయం కోసం.ఓ కొత్త భారతం కోసం.ఈ నవ స్వాతంత్ర పోరాటంలో మీరు కూడా భాగసామ్యులు కావచ్చు మీరు చెయ్యవలసిందల్ల Nava Bharath Nirman Army (NBN Army)లో జాయిన్ అవ్వడమే

Steps to join in Nava Bharath Nirman Army.
1.Logon to
http://www.groups.google.com/group/nbnarmy

2.Click on Join to this group link.

Indian Army దేశాన్ని శత్రువల నుండి కాపాడటం కోసం పోరాడుతుంది, దేశాన్ని మనలోనే వున్న దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి కాపాడటం కోసం పోరాడుతుంది Nava Bharath Nirman Army (NBN Army).